ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్, మూవీస్ రెండూ చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటూనే, సినిమాలు కూడా చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లోనూ పవర్ స్టార్ పాల్గొంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి బస్సు యాత్ర కూడా పవన్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే పవన్ తన సినిమాలు త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. దర్శకుడు క్రిష్ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని సమాచారం. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే..ఆయన రష్యాకు చెందిన అన్నాలెజ్నోవాతో కలిసి ఉంటున్నారు. ఈమె పవన్ కు మూడో భార్య. కాగా, రెండో భార్య ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్.
రేణూ దేశాయ్ కంటే ముందర పవన్ కల్యాణ్ విశాఖపట్నంకు చెందిన నందిని అనే యువతిని మ్యారేజ్ చేసుకున్నారు. చిరంజీవి ఈ సంబంధాన్ని కుదిర్చారట. అయితే, తర్వాత రేణూ దేశాయ్ తో పవన్ సహజీవనం చేసిన క్రమంలో విమర్శలు రాగా, రేణూ దేశాయ్ ను మ్యారేజ్ చేసుకున్నారు పవన్. ఆ తర్వాత రేణూకు డైవోర్స్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ తన మొదటి భార్య నందినికి డైవోర్స్ ఇచ్చిన టైమ్ లో రూ. 30 లక్షలు భరణంగా ఇచ్చారట. ఆ తర్వాత నందిని వైజాగ్ కు చెందిన ఓ వైద్యుడిని పెళ్లి చేసుకుందట. పవన్ కల్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత పాలిటిక్స్ లో ఫుల్ బిజీ కానున్నారు. కాగా, వీలును బట్టి నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా ప్లాన్ చేయాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీశ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’తో పాటు ‘సైరా’, ‘ఏజెంట్’ ఫేమ్ సురేందర్ రెడ్డితో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’..చిత్రాలు చేయనున్నారు. ‘వినోదయ సిత్తమ్’ రీమేక్ లోనూ పవన్ నటించనున్నారని టాక్.