మొదటిసారి చిరంజీవిని ఎదిరించిన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అన్నదమ్ములకు కేరాఫ్ అడ్రస్ చిరంజీవి సోదరులు అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఈవెంట్ ద్వారా వీరు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెడుతూనే ఉంటారు. చిరంజీవి మాటని జవదాటని తమ్ముళ్లుగా నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నారు. ఇలాంటి వీరు ఒకానొక సమయంలో చిరంజీవికే పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలిచారట.

అసలు విషయంలోకెళితే.. చిన్నప్పటినుండి పవన్ కళ్యాణ్ కి అటు చదువు మీద, ఇటు సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడూ కూడా ఏదైనా చిన్న జాబ్ చేయాలి .. వ్యవసాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడట. కానీ చిరంజీవి మాత్రం తాను హీరో అయ్యాక తన తమ్ముడిని ఎలాగైనా సరే హీరో చేయాలని భావించి.. అలా చూస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కి కూడా సినిమాలపై మక్కువ పెరిగేలా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కోసం కథలు వెతుకుతున్న సమయంలోనే ఎంతో మంది దర్శకులు చిరంజీవికి కథలు చెప్పారు. కానీ ఏ కథ కూడా ఆయనకు నచ్చలేదు.

అలా కథలన్నీ రిజెక్ట్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కి ఒకరోజు కోపం వచ్చి అసలు ఏంటన్నయ్య నా ఈ పరిస్థితి.. ఇలా ఎన్ని రోజులు కథలు రిజెక్ట్ చేసుకుంటూ నేను ఇలా తిరగాలి.. తప్పని సినిమాలు నేను చేయకపోయినా పర్లేదు.. నాకు హీరోగా చేయాలన్న కోరిక కూడా లేదు.. నేను సన్యాసం తీసుకుని బౌద్ధమతంలోకి వెళ్తాను అంటూ చెప్పాడట. అన్నట్టుగానే మరునాడు పారిపోయి మద్రాస్ వెళ్లాడు పవన్ కళ్యాణ్.. విషయం తెలుసుకున్న చిరంజీవి తమ్ముడు ఎక్కడ ఉన్నాడో వెతికించి మరీ ఒక ఇంట్లో బంధించారు. బయటికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టి నాగబాబును కాపలాగా ఉంచారట. ఇక తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ కి పరిచయం చేశారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version