తమిళ్ హీరో విజయ్‌కాంత్‌కు ప్రధాని నరేంద్రమోడీ ఫోన్..ఎందుకంటే?

కోలీవుడ్(తమిళ్) సీనియర్ హీరో, పొలిటీషియన్ విజయ్ కాంత్ కొద్ది రోజుల కిందట హెల్త్ ఇష్యూస్ తో ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన అనారోగ్యం విషయమై డీఎండీకే పార్టీ కార్యాలయం ప్రకటన చేసింది.

డీఎండీకే (దేశియ మురపొక్కు ద్రవిడ కజగం) పార్టీ అధినేత విజయ్ కాంత్ కొంత కాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్నారని తెలిపింది. ఆయన కుడి కాలి వేళ్లకు బ్లడ్ సప్లై కావడం లేదని, ఈ నేపథ్యంలోనే వైద్యులు ఆయన మూడు కాలి వేళ్లు తొలిగించారని తెలిపారు.

విజయ్ కాంత్ ఆరోగ్యంపై అసత్యాలు ప్రచారం చేయొద్దని డీఎండీకే పార్టీ కార్యాయలం కోరింది. కాగా, తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. విజయ్ కాంత్ సతీమణి ప్రేమలతా విజయ్ కాంత్ తో ఫోన్ లో మాట్లాడారు. విజయ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మోడీ..కెప్టెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.