ఆ పని చేసిందని హాట్ బ్యూటీపై కేసు..ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు

-

బాలీవుడ్ టౌన్ హాట్ బ్యూటీ పూనమ్ పాండేపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ భామపై కేసు నమోదు అయిన విషయం తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘లాకప్’ షోలోనూ పాల్గొన్న పూనమ్ పాండే పై..కేసు నమోదుకు గల కారణాలేంటంటే..2020లో కెనకొవా ఏరియాలోని ప్రభుత్వ ఆధీనంలోని చాపోలి డ్యామ్ వద్ద పూనమ్ పాండే న్యూడ్ ఫొటో షూట్ చేసింది. ఈ విషయమై స్థానికులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. డ్యామ్ వద్ద అశ్లీల వీడియోలు తీసిన పూనమ్ పాండే, ఆమె మాజీ భర్త శాంబాంబేపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గోవాలోని కెనకొనా పోలీసులు స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులు ..పూనమ్ పాండే డ్యామ్ వద్ద అశ్లీల వీడియోలు రికార్డు చేసిందని నిర్ధారించుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలను పోస్టు చేసినందుకు పూనమ్ పాండే పై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్ట ప్రకారం పూనమ్ పాండే పై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version