మరో రంగంలోకి ప్రభాస్ ఎంట్రీ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..‘రాధే శ్యామ్ ’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను పలకరించాడు. అయితే, సదరు చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఫిల్మ్స్ పైన పాన్ ఇండియా స్టార్ ..ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. ఇకపోతే ప్రభాస్ గురించి సోషల్ మీడియలో ప్రజెంట్ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినీ రంగంలో నెంబర్ వన్ గా కొనసా..గుతున్న క్రమంలో మరో రంగంలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో బిజీగా ఉన్న ప్రభాస్..తన ఫ్యూచర్ కోసం మరో రంగంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారట.

ఫిల్మ్స్ ద్వారా వస్తున్న ఆదాయంతో మరో రంగంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ కావాలని భావిస్తున్నారని టాక్. త్వరలో ప్రభాస్.. చైనా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారట. హోటల్ బిజినెస్ ఎక్స్ పాన్షన్ ద్వారా బిజినెస్ మ్యాన్ గా మారాలనుకుంటున్నారని వినికిడి. ఈ బిజినెస్ ప్లాన్ లో రెబల్ స్టార్ ఫుల్ ఫోకస్ పెట్టారట. చూడాలి మరి..సినీ రంగంలో సక్సెస్ అయిన ప్రభాస్..పారిశ్రామిక రంగంలో బిజినెస్ మ్యాన్ గా ఏ మేరకు సక్సెస్ అవుతారో..