పుష్ప 2 నుంచి కీలక అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ లీక్ !

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే వైజాగ్ తో పాటు యాగంటిలో పుష్ప -2 షెడ్యూల్ జరిగింది.

దీంతో పుష్ప-2 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ పుష్ప-2 అప్డేట్ గురించి ప్రశ్నించాడు. చాలా మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఎక్సక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ని సోషల్ మీడియా వేదికగా ఆరా తీశారు. వారికి ట్వీట్కు స్పందించిన శరత్ పుష్ప టీజర్ అఫ్ డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ వస్తుందని కామెంట్ చేశాడు. ఇది చూసిన బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version