పుష్ప-2 జాతర సీక్వెన్స్‌లో మహిళలకు అమ్మవారు పూనిన సంఘటన రెండు చోట్ల చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ హీరో అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాను డిసెంబర్ 04న ప్రీమియర్స్ వేశారు. తొలిరోజు ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చాయి. పుష్ప-2 కి సినిమాకి సంబంధించి తొలి రోజు రూ.294 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
భారత సినీ చరిత్రలోనే ఇదే అత్యధికం అంటూ పేర్కొంది. అయితే.. . పుష్ప-2 జాతర సీక్వెన్స్‌లో మహిళలకు అమ్మవారు పునినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా… సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. దీనిపై స్పందించిన జనసేన అడ్వకేట్.. ‘అన్యాయంగా బలైన కుటుంబానికి కేవలం రూ.25 లక్షలు మాత్రమే ఇస్తావా? నీకు మానవత్వం ఉందా? అని బన్నీని ప్రశ్నించారు. దీంతో అడ్వకేట్ తీరుపై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
పుష్ప-2 జాతర సీక్వెన్స్‌లో మహిళలకు అమ్మవారు పునినట్లు వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/70sRDwgDAQ
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2024