సరికొత్తగా ‘రాకెట్రీ’ పోస్టర్..మాధవన్ సినిమాపై భారీ అంచనాలు

ఇస్రోలో ఏరో స్పేస్ ఇంజినీర్ గా పని చేసిన నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్.మాధవన్ రచించి, దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ ఫిల్మ్ నుంచి తాజాగా సరి కొత్త పోస్టర్ విడుదల చేశారు.

ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి నంబి నారాయణన్..భార రహస్యాలను ఇతర దేశాలకు అందించడానే తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. అయితే, అవి ఆరోపణలు మాత్రమే అతను ఏ తప్పు చేయలేదని తర్వాత నిరూపితమైంది.

విలన్ గా మారిన గొప్ప శాస్త్రవేత్త, నిజమైన దేశ భక్తుడు..నంబి నారాయణన్ అని పేర్కొంటూ సరి కొత్త పోస్టర్ విడుదల చేశారు యాక్టర్ మాధవన్. వచ్చే నెల 1న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లిష్ భాషలోనూ ఈ పిక్చర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొత్త పోస్టర్ లో మువ్వన్నెల జెండాతో పాటు రాకెట్ చిత్రంలో మాధవన్ ఉండటం సరికొత్తగా ఉంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇందులో ఇంగ్లిష్ వర్షన్ లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ ప్లే చేయగా, సౌత్ వర్షన్ లో సూర్య అతిథి పాత్ర పోషించారు.