Rajamouli: డ్యాన్స్‌లో చిరంజీవి కంటే రామ్ చరణే బెటర్..రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలుగు చిత్ర సీమలో డ్యాన్స్ అంటే గుర్తొచ్చేది మొదటి హీరో మెగాస్టార్ చిరంజీవియే అని చెప్పొచ్చు. సెల్ఫ్ మేడ్ మ్యాన్ చిరంజీవి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. తాను హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి నాళ్లలో మిగతా హీరోల కంటే తను ప్రత్యేకంగా ఉండటం కోసం చాలా కష్టపడి పని చేశారు. కష్టతరమైన డ్యాన్స్ స్టెప్స్ సునాయసంగా చేసి ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ డ్యాన్స్ అయిపోయారు.

అటువంటి డ్యాన్స్ మాస్టర్ అయిన ‘ఆచార్య’ మెగాస్టార్ చిరంజీవి ఎదుటే ఆయన డ్యాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు RRR దర్శకుడు రాజమౌళి. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ లో తన పక్కన తనయుడు ఉన్నప్పటికీ పోటీ పడి మరి డ్యాన్స్ చేస్తాడని అలా చేయడం అభిమానిగా తనకు ఇష్టమేనని పేర్కొన్నాడు జక్కన్న. ఈ క్రమంలోనే తనకు దర్శకుడిగా తన హీరో రామ్ చరణ్ డ్యాన్స్ చిరంజీవి కంటే బెటర్ గా అనిపిస్తుందని అన్నాడు.

అలా రాజమౌళి డ్యాన్సింగ్ లెజెండ్ ఎదుట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, పుత్రజిత్ పరాజయం అన్నట్లుగా తనయుడు రామ్ చరణ్ చేతిలో ఓడిపోవడానికి తాను రెడీగానే ఉన్నానన్నట్లుగా చిరంజీవి రాజమౌళి మాటలకు చిరునవ్వు నవ్వేశారు. ఈ నెల 29న విడుదల కానున్న చిత్రం మాసివ్ హిట్ అవుతుందని అన్నారు రాజమౌళి. దర్శకులు కొరటాల శివ క్లాస్ మాత్రమే కాదు బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అని రాజమౌళి ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news