రకుల్ ప్రీత్ సింగ్ ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

-

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కెరటం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తదితర అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.

ఇక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఈ మధ్యనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తున్నా పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. దీంతో తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా సరైన అవకాశాలు మాత్రం రాలేదు రకుల్ ప్రీతిసింగ్ కి. అయితే ఇండస్ట్రీలో దాదాపుగా 10 సంవత్సరాల పైగానే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎంతటి ఆస్తి సంపాదించింది అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు.

ఈ విషయంలోకి వెళ్తే హైదరాబాద్, ముంబై, వైజాగ్ వంటి పలు ప్రాంతాలలో రకుల్ ప్రీతిసింగ్ ఫ్లాట్లు ఉన్నాయని దీని విలువ సుమారుగా రూ.15 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ మధ్యనే రకుల్ ప్రీతిసింగ్ పలు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. పలు రకాల జిమ్ సెంటర్లను ఓపెన్ చేసింది. వీటితోపాటు ఖరీదైన కార్లు కూడా ఈమె దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది అలాగే ఒక అత్యంత విలువైన డైమండ్ రింగు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో రకుల్ ప్రీతిసింగ్ ఆస్తి ఇప్పటివరకు రూ.65 కోట్లు పైన ఉన్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీ బగ్నానితో ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలియజేసింది. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version