మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు. RRR దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరు కాగా, చిరంజీవిని డైరెక్ట్ చేయబోయే మిగతా డైరెక్టర్లు కూడా వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో స్టార్ యాంకర్ సుమ ఫన్నీ క్వశ్చన్స్ అడగగా, వాటికి హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ దర్శకులు కొరటాల శివ ఆసక్తికర సమాధానాలిచ్చారు.
తమకు ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రశ్నల్లో కొన్నిటినీ అడుగుతున్నట్లు పేర్కొన్న సుమ..మీ ఇంట్లో నీకు ‘ఆచార్య’ ఎవరు? పవన్ కల్యాణా? లేదా చిరంజీవినా? అని అడిగింది సుమ. దాంతో మెగా ఫ్యాన్స్ ఈ ప్రశ్నకు ఏ సమాధానం వస్తుందని ఆసక్తిగా ఎదురుచూడగా, రామ్ చరణ్ ఆ క్వశ్చన్ స్కిప్ చేశాడు. ఈ క్రమంలోనే మరో ప్రశ్న అడిగి రామ్ చరణ్ ను ఇరకాటంలో పెట్టాలనుకుంది సుమ.
మీరు ఎవరికి భయపడతారు? నాన్నకా? లేదా ఉపాసనకా? అని అడగగా తెలివిగా సమాధానమిచ్చారు రామ్ చరణ్. ఈ ప్రశ్నకు సమాధానం తనకు తెలియదని, కానీ, నాన్న అమ్మ వద్ద జాగ్రత్తగా ఉంటారని, అది చూసి తను కూడా ఉపాసన వద్ద జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తమ ఇంట్లో తనకు కాని నాన్నకు కాని పవన్ కల్యాణ్ బాబాయ్‌కి కాని బాస్ అమ్మే అని మెగా ఫ్యామిలీ సీక్రెట్ రివీల్ చేశాడు చరణ్. ఇంతలో చిరంజీవి జోక్యం చేసుకుని గుడ్..సుఖపడుతావ్ వాళ్లతో పెట్టుకోవద్దని సూచించాడు.