ఎన్టీఆర్ మాటలను చాలెంజ్‌గా తీసుకున్న రామానాయుడు..అంత పని చేసిన మూవీ మొఘల్..!

-

మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు..చిత్రపరిశ్రమకు చేసిన సేవల గురించి అందరికీ తెలుసు. అగ్రనిర్మాతగా ఉండి ఎంతో మంది కొత్త నటీ నటులను, దర్శకులను, టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఏదైనా పని అనుకుంటే అది నెరవేరే వరకు పట్టు వదలని విక్రమార్కుడి వలే పని చేస్తారు. అలా ఓ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ అన్న మాటలను చాలెంజింగ్ గా తీసుకుని ఆ తర్వాత ఆయన చేతనే శభాష్ అనిపించుకున్నారు. రామానాయుడు చేసిన పని ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అప్పట్లో సినిమా షూటింగ్ లు అన్నీ కూడా చెన్నయ్(మద్రాసు)లోనే జరిగేవి. అనగా చిత్ర పరిశ్రమ మొత్తం కూడా మద్రాసులోనే ఉండేది. కాలక్రమంలో హైదరాబాద్ కు మారింది. కానీ, అప్పట్లో ఫిల్మ్స్ అన్నీ కూడా షూటింగ్ అక్కడే జరిగేవి. అయితే, చిత్రపరిశ్రమ హైదరాబాద్ కు రావాలని అందరూ అనుకున్నారు.

అలా అప్పుడే పనులు కూడా జరుగుతున్నాయి. ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కూడా స్థలం ఇచ్చేందుకు రెడీ అయింది. అలా అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్ఆర్)కు అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రభుత్వం కొంత స్థలం కేటాయించింది. ఆ స్థలంలో ఏఎన్ఆర్ స్టూడియో కట్టుకున్నారు.

అలా ఆ స్టూడియోలో సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. మిగతా వాళ్లకు అనగా సినీ ప్రముఖులకు స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. రామానాయుడు, కృష్ణలకు అప్పటి భవనం వెంకట్రామ్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. రామానాయుడుకు అప్పటి సర్కారు ఇచ్చిన స్థలాన్ని చూసిన సీనియర్ ఎన్టీఆర్.. ఇక్కడ రాళ్లలో ఏం స్టూడియో కడతావు? అని అన్నారట.

అప్పుడు రామానాయుడు వ్యూ బాగుందని బదులిచ్చారు. వ్యాపారం చేయాలంటే ఏదైనా వేరే స్థలం చూసుకో..అని ఎన్టీఆర్ అన్నారట. ఆయన మాటలను చాలెంజ్ గా తీసుకున్న రామానాయుడు.. కొండలను తొలిచి..స్టూడియో కట్టేందుకు పనులు స్టార్ట్ చేశాడు. రాళ్లను పగులగొట్టడానికి సుమారు ఆరు నెలల టైం పట్టిందట. అలా కృషితో, పట్టుదలతో అదే ప్రాంతంలో రామానాయుడు స్టూడియో నిర్మించాడు. ఆ తర్వాత అది చూసిన సీనియర్ ఎన్టీఆర్ రామానాయుడును ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news