అట్టహాసంగా రామ్‌చరణ్‌ RC16 సినిమా పూజాకార్యక్రమం

-

ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ప్రముఖ దర్శకులు శంకర్‌, సుకుమార్‌, నటుడు మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్‌, బీ టౌన్ ప్రొడ్యూసర్, జాన్వీ తండ్రి బోనీ కపూర్‌తోపాటు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

పూజా కార్యక్రమం అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందని, ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌ అవుతారని తెలిపారు. స్పోర్ట్స్‌ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు సమాచారం. ఈ మూవీకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. RC16గా ఇది ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘పెద్ది’ టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version