Ram Charan: RC 15 టైటిల్ లాక్‌డ్..భారీ ధరకు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..RRR వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత చేస్తున్న సినిమా RC15. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ స్టోరి అందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తారని టాక్.

ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా, విడుదలకు ముందే ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE చానెల్ దాదాపు రూ.150 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవల డైరెక్టర్ శంకర్ లాక్ చేసినట్లు టాక్. ‘సర్కారోడు’, ‘అధికారి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉండగా, ఫైనల్ గా ‘అధికారి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వినికిడి.

ఇకపోతే ఈ చిత్రంలో నటిస్తున్న క్రమంలో తాను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ ఫ్యాన్ బాయ్ గా ..సినిమాలో తన పాత్ర పరిధి మేరకు నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శంకర్ దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్న చరణ్..డెఫినెట్ గా సినిమా చాలా బాగుంటుందని తెలిపారు. ఇందులో చరణ్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news