Ram Charan: RC15 లేటెస్ట్ అప్‌డేట్..మరో షెడ్యూల్ ఎక్కడంటే?

-

RRR వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న పిక్చర్ RC15. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన లీకులు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. వరుసగా రామ చరణ్ పిక్చర్స్ నెట్టింట లీక్ అవుతూనే ఉన్నాయి.

ఇక ఈ సినిమా స్టోరికి సంబంధించిన లీకులను స్వయంగా రామ్ చరణ్ కూడా ఓ ఈవెంట్ లో ఇచ్చేయడం గమనార్హం. తను IAS, IPS ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు చెప్పేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ ఫిల్మ్ కు స్టోరి అందించినప్పటికీ సినిమాలో శంకర్ మార్క్ ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సొసైటీని ఆలోచింపజేసే విధంగా శంకర్ సినిమాలు తీస్తుంటారు. కాగా, RC15లోనూ డెఫినెట్ గా అటువంటి థాట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పుణే, అమృత్ సర్, పంజాబ్ లో షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన RC15 టీమ్..ప్రజెంట్ ఏపీలోని వైజాగ్ లో షూట్ చేస్తున్నారు. రామ్ చరణ్ పైన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు టాక్. కొవిడ్ వలన చిత్ర షూటింగ్ ఆలస్యమైందని, కాగా, ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేయాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా, కీలక పాత్రలను శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరాం, సురేశ్ గోపీ పోషిస్తున్నారు. దాదాపు రూ.170 కోట్లతో పిక్చర్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఫిల్మ్ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news