నెపొటిజమ్ అంటూ అకీరా సినీ ఎంట్రీపై విమర్శలు.. రేణూ దేశాయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

-

గత నాలుగు రోజులుగా నెట్టింట పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ గురించి చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై పవర్ స్టార్ అభిమానులంతా త్వరలోనే అతడు సినిమాల్లో నటించనున్నాడని సంతోషపడుతున్నారు. మరోవైపు ఇంకొందరేమో విమర్శలు చేస్తున్నారు. వారసులకు సులువుగా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి.. ఇది ఎంత వరకు సమంజసం? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

దీనిపై రేణూ దేశాయ్ స్పందించారు. ఆ నెటిజన్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏం అన్నారంటే.. ‘‘మీరు మంచి ప్రశ్నే అడిగారు.. అంబానీ తన కంపెనీని తన సంతానానికి కాకుండా బయటి వ్యక్తులకు ఇస్తే అది సమంజసం అంటారా? ఇదీ అంతే.. చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి సులభంగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వాళ్లు వారి తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయినా.. నటులుగా వాళ్లని వాళ్లు నిరూపించుకోవడంలో విఫలమైనా.. కొందరు వారిని ఏమాత్రం జాలి లేకుండా దారుణంగా ట్రోల్‌ చేస్తారు. అదే.. స్టార్‌ వారసులు కాకుండా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు విఫలమైతే ఎవరూ పట్టించుకోరు. వాళ్లు సక్సెస్‌ అయితే మాత్రం గొప్ప స్టార్స్‌ అవుతారు. ఇక్కడ విషయమేమిటంటే.. వారసులు రావడం ముఖ్యం కాదు. వాళ్లలోని ప్రతిభ ముఖ్యం. టాలెంట్‌ ఆధారంగా స్టార్స్‌ అవుతారు కానీ.. వారసులు కావడం వల్ల కాదు’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version