Big Boss OTT Telugu: కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్..చివరకు కెప్టెన్ ఎవరయ్యారంటే?

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షో లో ఎనిమిదో వారం కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య వెరీ టఫ్ ఫైట్ జరిగింది. కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్క్ లో నెగ్గడం కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు. గేమ్ లో ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముందుకెళ్లారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కంటెస్టెంట్స్ బాగానే కష్టపడ్డారు.

టాస్క్ లో భాగంగా పరిగెత్తుకొచ్చీ ప్లాస్క్ లో నీళ్లు నింపే క్రమంలో కంటెస్టెంట్స్ రోప్స్ దాటుకుంటూ వచ్చారు. అది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కంటెస్టెంట్స్ టాస్క్ పర్ఫార్మ్ చేయడంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇక చివరకు టాస్క్ రసవత్తరమై ఇద్దరే మిగిలి సమయంలో బాబా భాస్కర్ మాస్టర్ ట్విస్ట్ ఇచ్చినట్లే ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. అఖిల్ కు సపోర్ట్ చేసి చివరకు అఖిల్ కెప్టెన్ అయ్యేలా చేశారు.

అలా చివరకు అఖిల్ కెప్టెన్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో అఖిల్ కెప్టెన్ గా డ్యూటీస్ డివైడ్ చేశాడు. బాబా మాస్టర్ ను రేషన్ మేనేజర్ గా నియమించాడు. బాబా మాస్టర్ చివరలో అనూహ్యంగా సపోర్ట్ చేయడం వలనే బహుశా రేషన్ మేనేజర్ గా బాబాను నియమించారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. గతంలో మిత్రా శర్మకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించిన అఖిల్..కొద్ది రోజుల నుంచి మిత్రా శర్మకు ఫేవర్ గా గేమ్ ఆడుతున్నట్లు కనబడుతున్నాడు. మొత్తంగా కెప్టెన్సీ గేమ్ ఇలా ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news