రౌడీబాయ్స్ హీరో ఎంగేజ్​మెంట్.. త్వరలో వివాహం

-

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట వేడుక జరిగింది. ఆయన ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ రెడ్డి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని ఆశిష్ పెళ్లాడనున్నాడు. గురువారం రోజున వీరి నిశ్చితార్థ వేడుక అంబరంగా వైభవంగా జరిగింది.

ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరై ఈ వేడుకలో సందడి చేశారు. అద్విత తండ్రి వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆశిష్ – అద్వితల వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సమాచారం. ఇక ఆశిష్ గురించి వస్తే ఇతను.. ‘రౌడీబాయ్స్‌’ సినిమాతో టాలీవుడ్ వెండితెరపై అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. గత సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రంలో ఆశిష్​కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆశిష్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. విశాల్‌ కాశీ దర్శకత్వంలో నటిస్తున్న ‘సెల్ఫిష్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ఇవానా హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఆశిష్‌ హీరోగా ఇటీవల ఓ సినిమా పట్టాలెక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version