ఆ థియేటర్‌‌లో RRR‌కు క్రేజ్ మామూలుగా లేదు.. ఆడియన్స్ అల్టిమేట్ రియాక్షన్ ఇదే..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఈ ఫిల్మ్ కాగా, ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీ రోల్ ప్లే చేశారు. ఎం.ఎం.కీరవాణి అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

- Advertisement -

ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ స్టోరి అందించగా, మూవీ విజ్యువల్ వండర్ గా ఉందని సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు చిత్రం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యులను, హీరోలను అభినందించారు. చిత్రం విడుదలై దాదాపు వన్ వీక్ దాటింది. అయినా థియేటర్స్ లో జనం ఫుల్ గా వస్తున్నారు. టాకీసుల వద్ద హౌజ్ ఫుల్ బోర్డులే ప్రదర్శితమవుతున్నాయి.

ఇక ఈ ఫిల్మ్ లో ‘నాటు నాటు’ సాంగ్ కు రామ్ చరణ్, తారక్ ల స్టెప్పులు చూసి ప్రేక్షకులకు పూనకాలు వస్తున్నాయి. తమిళనాడులోని తిరుచిరపల్లి బీహెచ్ఈఎల్ సినిమాస్ ట్రిచిలో ప్రేక్షకులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

సినిమా ప్రదర్శితమవుతున్న టైంలో ‘నాటు నాటు’ సాంగ్ ప్లే అవుతుండగా వారందరూ లేచి తమ చేతిలో రుమాలు తిప్పుతూ అలా కేరింతలు కొడుతూ అరుస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్ వారు తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియో షేర్ చేశారు. అది చూసి తెలుగు వారు గర్వపడుతున్నారు. తమిళనాట అభిమానుల సందడి హర్షణీయమని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...