ట్రిపుల్ ఆర్ పై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు… హాలీవుడ్ ను బీట్ చేస్తుందని పొగడ్త

-

‘ ఆర్ ఆర్ ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ తో పాటు ఇతర ఫిలిం ఇండస్ట్రీలకు టాలీవుడ్ సత్తాను చాటి చెబుతోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ పై సహజంగానే అంచనాలు పెరిగాయి. తెలుగు, హిందీ, మళయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదలైన ట్రిపుల్ ఆర్… అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉంటే సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు డైరెక్టర్ శంకర్, మళయాళ స్టార్ హీరో ప్రుథ్వీ రాజ్ సుకుమారన్, తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇలా అంతా ట్రిపుల్ ఆర్ ను ప్రశంసిస్తున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ట్రిపుల్ ఆర్ పై ప్రశంసలు కురిపించారు. సినిమాని ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేసి దూసుకెళ్తోందని అన్నాడు. భారతీయ సినిమా ఈరేంజ్  లో విజయం సాధించడం గర్వంగా ఉందని ఆయన అన్నాడు. రాజమౌళి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయని ప్రశంసించారు. ‘నాటు నాటు’ సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news