రెజీనాతో ప్రేమ, పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్..!

-

ప్రముఖ యంగ్ హీరో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే నాలుగు సినిమాలలో నటించారు.. సాధారణంగా ఒక హీరో హీరోయిన్ రెండు సినిమాలలో నటించారంటేనే వారి మధ్య క్లోజ్ నెస్ బాగా పెరిగిపోతుంది. అలాంటిది వీరు నాలుగు సినిమాలలో నటించారు అంటే వీరి మధ్య ఏర్పడే క్లోజ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వీరిద్దరి రిలేషన్ పై ఎక్కువగా వార్తలు వస్తూ ఉంటాయి.. అందులో భాగంగానే రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్ కిషన్ కూడా రొమాంటిక్గా ఫోటో షేర్ చేసి లవ్ యు అంటూ చాలా సాధారణంగానే విషెస్ చెప్పాడు. అయితే ఈ విషయంపై చాలామంది వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అంటూ రకరకాల కథనాలను సృష్టించారు.

ఈ జంట ఒక్క తెలుగులోనే కాదు కోలీవుడ్ లో కూడా భారీగా రూమర్స్ కంటపడింది. అందుకే ఒకవైపు ట్రోల్స్ మరొకవైపు రూమర్స్ అంటూ విసిగిపోయిన వీరు ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే సందీప్ కిషన్ తాజాగా నటిస్తున్న చిత్రం మైఖేల్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెజీనాతో ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా మా స్నేహబంధం కొనసాగుతోంది. మేము ఇద్దరం కలిసి నాలుగు సినిమాలలో నటించాము.. అప్పుడు చాలా ఫోటోలే తీసుకున్నాము.. అందులో ఏముంది.. చెన్నై వాసులు కూడా ఈ వార్తలు రాశారు అంటే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ తెలుగు మీడియా అలా రాయదు.. మా గురించి రాసి రాసి వాళ్లకు కూడా బోర్ కొట్టేసింది..

నాకు ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే.. ముంబైలో ఆమె షూటింగ్ ఆలస్యం అయితే మాత్రం తప్పకుండా ఆమె మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది. అంత క్లోజ్ నెస్ మా మధ్య ఉంది అంటూ తమ రిలేషన్ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు సందీప్ కిషన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version