అఫీషియల్: అభిమానులకు షారుఖ్ ఖాన్ సర్‌ప్రైజ్..‘పఠాన్’ అప్‌డేట్

-

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్..నాలుగేళ్ల కిందట ‘జీరో’ చిత్రంలో ప్రేక్షకులకు చివరగా కనిపించారు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ..వరుస మూవీల షూటింగ్స్ లో షారుఖ్ ఫుల్ బిజీగా ఉన్నారు.

తమిళ్ డైరెక్టర్ అట్లీతో ‘జవాన్’ పిక్చర్ చేస్తున్న షారుఖ్..ఆ సినిమా అప్ డేట్ ఇచ్చేశాడు. వచ్చే ఏడాది జూన్ 2న పాన్ ఇండియా ఫిల్మ్ గా అన్ని భాషల్లో ఆ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమా ‘‘పఠాన్’’ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు.

బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘పఠాన్’ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ ఫిల్మ్ ను తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో షారుఖ్ లుక్ అదిరిపోయింది. పొడవు గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్ తో అదరగొట్టారు బాలీవుడ్ సూపర్ స్టార్ . ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికా పదుకొణే నటించగా కీలక పాత్రను జాన్ అబ్రహం పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news