షూటింగ్‌లో ఎన్టీఆర్ ముఖానికి గాయం..ఆయన చేసిన పనికి మూవీ యూనిట్ షాక్..ఏం చేశారంటే?

సీనియర్ ఎన్టీఆర్..తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన లెజెండ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రంగంలోనే కాదు ఆయన రాజకీయ రంగంలోనూ రాణించారు. ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఆయన పోషించని పాత్ర లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినీ ప్రేక్షకులు, అభిమానుల కోసం విభిన్న పాత్రలు పోషించి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు.

ఇక సినిమా షూటింగ్ టైమ్ లో సీనియర్ ఎన్టీఆర్ దేనికి భయపడే వారు కాదు. ఎలాంటి కష్టతరమైన పని అయినా సరే..ధైర్యంగా చేసేవారు. అలా ఓ సినిమా షూటింగ్ టైమ్ లో ఎన్టీఆర్ చేసిన పని చూసి మూవీ యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే…‘ఎదురీత’ ఫిల్మ్ షూటింగ్ టైమ్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది.

వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ పిక్చర్ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా వాణి శ్రీ నటించింది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇందులో ప్రతి కథానాయకుడి పాత్ర పోషించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా లంక గ్రామాల్లో షూటింగ్ పూర్తయిన తర్వాత యానంలో ఓ సీన్ ప్లాన్ చేశారు మూవీ యూనిట్ సభ్యులు.

ఓ ఫైట్ కోసం యానంలో షిప్స్ పైన సైడ్ ఆర్టిస్టులతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ సీన్ లోకి ఎన్టీఆర్ కూడా ఎంటరయి ఫైట్ చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఓ ఇనుప రాడ్ వచ్చి ఎన్టీఆర్ ముఖానికి తాకింది. దాంతో ఎన్టీఆర్ ముఖం నుంచి రక్తం కారుతోంది.

edureeta ntr senior film
edureeta ntr senior film

అది చూసి మూవీ యూనిట్ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే షూటింగ్ కు బ్రేక్ చెప్పి ఒడ్డు మీదకు వచ్చారు. అక్కడకు వచ్చిన తర్వాత ఒడ్డుపైన ఆరబోసిన ఎండు మిరపకాయలు కొన్నిటిని తీసుకుని ఎన్టీఆర్ నమిలేశారు. అది చూసి మూవీ యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ఆ వెంటనే షూటింగ్ మొదలుపెడదామని ఎన్టీఆర్ చెప్పగా, మూవీ యూనిట్ సభ్యులు మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారట. అలా ఆశ్చర్యకరమైన సంఘటన ఎన్టీఆర్ సినిమా షూటింగ్ టైమ్ లో జరిగింది.