ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్టుకు ఆలియా భట్ ఎంత ఛార్జ్ చేస్తుందో తెలిస్తే షాక్..!!

-

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అందరికంటే ఎక్కువ పారితోషకం తీసుకునే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్లో నాచురల్ బ్యూటీగా పేరుపొందిన ఆలియా భట్ ఇటీవలే తను ప్రేమించిన రణ్ బీర్ కపూర్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహం జరిగిన రెండు నెలలకి తల్లి కాబోతున్నాను అని ప్రకటించి అందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది ఈ ముద్దుగుమ్మ.

కేవలం హిందీలోనే కాకుండా తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సీత పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో 68.5 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఆలియా భట్ ఒక కమర్షియల్ పోస్ట్ చేస్తే ఎంతవరకు ఛార్జ్ చేస్తుందనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం అలియా భట్ ఒక్కో కమర్షియల్ పోస్ట్ కోసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకు వసూలు చేస్తుందని టాక్. దీన్నిబట్టి చూస్తే ఆలియా భట్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇకపోతే ప్రెగ్నెంట్ అయిన తర్వాత సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇవ్వకుండా కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు కంప్లీట్ చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్ లో కూడా ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. షూటింగును పోర్చుగల్లులోని ఎడారిలో కంప్లీట్ చేశారు. అయితే ఆ సమయంలో ఆలియా పాల్గొన్నప్పుడు కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version