పాతికేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకనున్న శ్రీకాంత్ ఊహ.. !

-

టాలీవుడ్ లో మోస్ట్ లవ్లీ కపుల్ లో ఒకరుగా ఉన్న శ్రీకాంత్ ఊహ త్వరలోనే విడిపోనున్నారని వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరి మధ్య కొన్నాళ్ళుగా గొడవలు జరుగుతున్నాయని అందుకే విడిపోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

హీరో శ్రీకాంత్ ఊహ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి 1997లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఇప్పటివరకు ఎంతో అన్యోన్య జీవితాన్ని గడిపారు.. అయితే పాతికేళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు చెబుతూ వీరిద్దరూ విడిపోవాలి అనుకుంటున్నారని వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.కొన్నాళ్లుగా శ్రీకాంత్ తో ఊహకు విబేధాలు తలెత్తుతున్నాయట. ఆర్థికపరమైన ఇబ్బందులు వీరి మధ్య గొడవలకు కారణమయ్యాయని సమాచారం. మనస్పర్థలు తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే విషయం తెలుసుకున్న అభిమానులంతా విడిపోయేంత సమస్య ఏమొచ్చిందా అని వాపోతున్నారు అయితే అసలు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

అయితే ఊహ కెరియర్ కన్నడ పరిశ్రమలో మొదలైంది ఆమె తెలుగులో కన్నా ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది 1994లో శ్రీకాంత్ హీరోగా నటించిన ఆమె చిత్రంతో తెలుగు పరిచయమైన ఊహ.. ఆ తర్వాత వరస అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరియర్లో దూసుకుపోయింది.. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే శ్రీకాంత్ ఊహ మధ్య ప్రేమ చిగురించింది. 1997లో శ్రీకాంత్-ఊహ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా పరిశ్రమకు పరిచయమయ్యారు. నిర్మల కాన్వెంట్, పెళ్ళిసందడి చిత్రాల్లో హీరోగా నటించాడు.

అయితే ఒకప్పుడు కెరీర్ పరంగా వరుస అవకాశాలతో దూసుకు వెళ్లిన శ్రీకాంత్ ప్రస్తుతం అవకాశాలు అందిపుచ్చుకోవటంలో ఇబ్బందులు పడుతున్నట్టే తెలుస్తోంది… హీరోగా ఫేడ్ అవుటైన శ్రీకాంత్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version