HBD Pawan: విజయ దశమి రోజున పూజ.. ఆ తర్వాత ఆగిపోయిన పవన్ కల్యాణ్ ప్రాజెక్టు ఇదే..

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అశేష అభిమానులు, సినీ , రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా, ఆయన కెరీర్ లో మిగతా హీరోలతో పోల్చితే చేసింది తక్కువ సినిమాలే. అయినప్పటికీ అశేష అభిమానులను పవన్ కల్యాణ్ కలిగి ఉన్నారు.

తమిళ్ దర్శకుడు ఆర్.టీ.నేసన్ దర్శకత్వంలో ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం పర్యవేక్షణలో ఓ ప్రాజెక్టు పవన్ కల్యాణ్ చేయబోతున్నారని అప్పట్లో ప్రకటించారు. 2016 అక్టోబర్ 13న అనగా విజయ దశమి రోజున ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సాయిరాం క్రియేషన్స్ బ్యానర్ పైన నాల్గో సినిమాగా ఐశ్వర్య నిర్మాతగా తన పర్యవేక్షణలో కమర్షియల్ ఎంటర్ టైనర్ రాబోతున్నదని ఏ.ఎం.రత్నం ప్రకటించారు.

ఏ.ఎం.రత్నం నిర్మాణ పర్యవేక్షణలో తను చక్కటి కమర్షియల్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులకు అందిస్తానని దర్శకుడు ఆర్.టీ.నేసన్ చెప్పారు. కానీ, ఆ తర్వాత క్రమంలో ఈ ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది. ‘ఖుషి’, ‘బంగారం’ వంటి సినిమాలను పవన్ కల్యాణ్ తో తీసిన ఏ.ఎం.రత్నం ప్రస్తుతం ఆయనతో పాన్ ఇండియా సినిమా ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు.

‘హరిహర వీరమల్లు’ గ్లింప్స్ ను పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేయగా, అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్, సినిమాలు రెండూ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీ శ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news