యంగ్ హీరోకు సూపర్ స్టార్ సర్ ప్రైజ్..ఆ ఫిల్మ్‌పై రజనీకాంత్ ప్రశంసల వర్షం

శాండల్ వుడ్(కన్నడ) హీరో రక్షిత్ శెట్టి నటించిన తాజా చిత్రం ‘‘777 చార్లీ’’. సంగీత శ్రింగేరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కె.కిరణ్ రాజ్ దర్శకత్వం వహించారు . ఈ పిక్చర్ ను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా రిలీజ్ చేశారు.

ఈ నెల 10న విడుదలైన ఈ ఫిల్మ్…కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ సినిమా చూసి కన్నీటి పర్యంతమయ్యారు. జంతువుల ప్రేమ గురించి ఈ పిక్చర్ లో చాలా చక్కగా ప్రజెంట్ చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. మూవీ యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

తాజాగా ఈ సినిమాను తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఈ సందర్భంగా మూవీ హీరో రక్షిత్ శెట్టి కి ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని స్వయంగా హీరో రక్షిత్ శెట్టి ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనకు ఈ రోజు ఎంతో గొప్పగా స్టార్ట్ అయిందని, సూపర్ స్టార్ రజనీకాంత్ పోన్ చేశారని, ‘777 చార్లీ’ సినిమా చూసి అత్యద్భుతంగా ఫీలయ్యారని తెలిపారు. సినిమా క్వాలిటీ, క్లైమాక్స్ తనకు చాలా బాగా నచ్చిందని రజనీకాంత్ చప్పారని చెప్పాడు రక్షిత్ శెట్టి. తనకు ఫోన్ చేసిన రజనీకాంత్ కు థాంక్స్ చెప్పాడు యంగ్ హీరో రక్షిత్ శెట్టి.