హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. హీరోయిన్ ఎవరంటే?

-

బిగ్బాస్ రియాల్టీ షో నుంచి బయటకు వచ్చిన చాలా మంది కెరీర్ మూడు పూవులు ఆరు కాయలుగా సాగిపోతోంది. కొందరైతే బుల్లితెర నుంచి వెండితెర అరంగేట్రం చేసేశారు. ఇక తాజాగా ఆ జాబితాలో మరో బిగ్బాస్ కంటెస్టెంట్ చేరాడు. బిగ్బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా వచ్చి రన్నరప్గా నిలిచిన అమర్దీప్ వెండితరెపైకి అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది.

ఇప్పటివరకు కేవలం బుల్లితెరకే పరిమితమైన అమర్దీప్ త్వరలో సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మిస్తున్న బ్యానర్ M3 మీడియా స్వయంగా ప్రకటించింది. ఈ మూవీలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్ పాత్ర పోషించనుందట. ఇప్పటికే సోషల్ మీడియాలో సుప్రీత అంటే తెలియని వారుండరు. తన తల్లి సురేఖా వాణితో కలిసి సుప్రీత నెట్టింట చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

ఇదిలాఉంటే ఇప్పటివరకు జరిగిన బిగ్బాస్-తెలుగు సీజన్స్లో పాల్గొన్న వారిలో సీజన్-4లో సెకెండ్ రన్నరప్గా నిలిచిన సయ్యద్ సోహైల్ సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో హీరోగా నటించి అలా వరుస అవకాశాలతో వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఇటీవల బిగ్బాస్-7 కంటెస్టెంట్, డ్యాన్స్ మాస్టర్ సందీప్ కూడా హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version