sushmita sen : మాజీ ప్రియుడితో సుస్మితా సేన్ కసరత్తులు.. ఫొటోలు వైరల్

-

మాజీ విశ్వసుందరి.. బాలీవుడ్ స్టార్ సుస్మితాసేన్​ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇక ఈ బ్యూటీకి ఫిట్​నెస్​పై ఉన్న ప్రేమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్​గా జిమ్​కు వెళ్తూ.. కఠినమైన కసరత్తులు చేస్తూ ఆ ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన మాజీ బాయ్​ఫ్రెండ్ రోహ్మన్ షాల్​తో కలిసి అప్పట్లో జిమ్​కు వెళ్లేది. అక్కడ ఇద్దరూ కలిసి ఎక్సర్​సైజ్ చేసిన ఫొటోలు పోస్టు చేసేది.

అయితే ఇటీవల సుస్మితా సేన్​కు గుండెపోటు రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్‌ వేశారు. ప్రస్తుతం గుండెపోటు నుంచి కోలుకున్న ఆమె మళ్లీ జిమ్​ బాట పట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడిలో సుస్మిత, ఆమె కుమార్తె అలీశా, సుస్మిత మాజీ ప్రియుడు రోహ్మన్‌ షాల్‌ ఉన్నారు. వీరందరూ కొన్ని రకాల వ్యాయామాలు చేశారు.

ఈ వీడియో కింద..’సంకల్పం ఒక్కటే మార్గం. మరింత శిక్షణకు అనుమతి లభించింది. నా ప్రియమైన వాళ్లు తిరిగి నేను ఎక్సర్‌సైజ్‌ చేసేందుకు సాయం చేస్తున్నారు. అలీశాకు, రోహ్మన్‌ షాల్‌కు నేను కిసెస్‌ పంపిస్తున్నాను. ఐ లవ్యూ గయ్స్‌..’ అంటూ సుస్మిత క్యాప్షన్‌ జోడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version