ట్రెండ్ ఇన్: నెట్టింట విజయ్ అభిమానుల సందడి.. అప్పుడే తలపతి బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్..తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడమే కాదు..నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ సినిమా అని స్వయంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ యే చెప్పుకునే రేంజ్ కు ఎదిగారు. సినిమాల్లో చాలా యాక్టివ్ గా ఉండే తలపతి విజయ్..నిజ జీవితంలో కంపోజ్ డ్ గా ఉంటారు.

ఇక తలపతి విజయ్ సినిమాలు తమిళ్ లోనే కాదు..తెలుగులోనూ సత్తా చాటుతున్నాయి. ప్రస్తుతం విజయ్..తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో తన 66వ సినిమా చేస్తున్నారు. ఈ పిక్చర్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రష్మిక మందన హీరోయిన్. ఇక ఈ ఫిల్మ్ లో భారీ తారాగణమే ఉంది. సంగీత, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, ప్రభు, జయసుధ, శ్యామ్ తదితరులు ఉన్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ నెల 22న విజయ్ బర్త్ డే..ఈ నేపథ్యంలో శైను మాష్ అనే వ్యక్తి డిజైన్ చేసిన కామన్ డీపీని సెలబ్రిటీలు తెగ షేర్ చేస్తున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ వేదికగా పలువురు సెలబ్రిటీలు ఈ పోస్టర్ ను ట్వీట్ చేశారు.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీ శ్ శంకర్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే, వేదిక తదితరులు పోస్టర్ ట్వీట్ చేశారు.వైట్ బనియన్ వేసుకుని ఉన్న తలపతి విజయ్ లుక్..డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ పోస్టర్ ను నెటిజన్లు వరుసగా #Thalapathy48BirthdayCDP తలపతి 48 బర్త్ డే సీడీపీ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. విజయ్..66వ సినిమా అప్ డేట్ ఈ నెల 22న మేకర్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news