‘తలపతి 66’లో భారీ తారాగణం..ప్రకాశ్ రాజ్‌తో కలిపి మరో ‘బృందావనం’!

-

‘మహర్షి’ వంటి నేషనల్ అవార్డు గెలుచుకున్న పిక్చర్ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలపతి 66’ . కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్ డేట్స్ తాజాగా వెంట వెంటనే ఇచ్చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ..స్టోరి చాలా బాగుందని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో భారీ తారాగణమే ఉండబోతున్నదన్న సంగతి స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలను ప్రభు, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ పోషిస్తారని తాజాగా అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో వంశీ పైడిపల్లి మరో ‘బృందావనం’ లాంటి సినిమా తీస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.

విజయ్, రష్మిక మందన హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంత మంది తారలు ఉంటున్నారనే విషయం ద్వారా డెఫినెట్ గా ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగానే ఉండబోతున్నదని సినీ పరిశీలకులూ అంచనా వేస్తున్నారు. వంశీ పైడిపల్లి స్టోరిపైన ఉన్న కాన్ఫిడెన్స్ తోనే దిల్ రాజు ఈ సినిమాను గ్రాండియర్ గా తెరకెక్కించబోతున్నారు. హైదరాబాద్ లో ఈ పిక్చర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version