శంకర్ ‘అపరిచితుడు’ చిత్రానికి నో చెప్పిన స్టార్ హీరో..ఎవరో తెలుసా?

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్..సిల్వర్ స్క్రీన్ పైన చేసే గ్రాండియర్ మ్యాజిక్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పిక్చర్ విడుదలయితే చాలు..జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టాల్సిందే. అటువంటి జీనియస్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపరిచితుడు’ పిక్చర్ స్టోరిని ఓ స్టార్ హీరో కు వినిపించగా, ఆయన రిజెక్ట్ చేశారట. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

aparichitudu shankar movie vikram
aparichitudu shankar movie vikram

‘అపరిచితుడు’ చిత్రంలో దర్శకుడు శంకర్ నిర్లక్ష్యం గురించి చక్కగా చర్చించాడు. నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి వలన దేశం ఎలా అభివృద్ధి చెందకుండా అలానే ఉండిపోతుందో వివరించాడు. ఈ ఫిల్మ్ చూసిన ప్రతీ ఒక్కరు దర్శకుడు శంకర్ ఆలోచనను చూసి అభినందించకుండా ఉండలేరు. ఇక హీరో పాత్రలో మూడు రకాల వేరియేషన్స్ అదిరిపోతాయి.

స్క్రీన్ ప్లే విషయం లో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్త వహించారు. చాలా చక్కగా స్టోరిని అందరికీ అర్థమయ్యే విధంగా, సస్పెన్స్ అలానే కంటిన్యూ చేస్తూ సినిమాను కొనసాగించాడు. తొలుతు ఈ సినిమా స్టోరిని శంకర్..సూపర్ స్టార్ రజనీకాంత్ కు వినిపించారట. కానీ, ఆయన నో చెప్పారట. దాంతో ఈ పిక్చర్ విక్రమ్ వద్దకు వెళ్లింది.

అలా విక్రమ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా ‘అపరిచితుడు’ నిలిచిపోయింది. ఇందులో చియాన్ విక్రమ్ తన నట విశ్వరూపం చూపించారు. ఆస్కార్ రవిచంద్రన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా, హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చారు. సదా హీరోయిన్ గా నటించింది.

విక్రమ్ ఈ సినిమాలో పాత్రల వేరియేషన్స్ కోసం చాలా కష్టపడ్డారు. బాడీ పెంచడంతో పాటు తగ్గించి పాత్రకు తగ్గట్లు అభినయం చేసి సినీ అభిమానులను అలరించారు. ఇక ఇందులో పాటలను శంకర్ చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. దర్శకుడు శంకర్ సిల్వర్ స్క్రీన్ పైన ప్రేక్షకులకు కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు..చక్కటి మెసేజ్ అందించారు. త్వరలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో శంకర్ రీమేక్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. హిందీ భాషలో చేయనున్న ఈ పిక్చర్ లో ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news