చిరంజీవికి ఆ బిరుదు ఇచ్చిన మూవీకి @ 35 ఏళ్లు..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. కెరియర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలు అందుకున్న ఆయన 1983లో రిలీజ్ అయిన ఖైదీ సినిమా తోనే పూర్తిస్థాయిలో స్టార్ స్టేటస్ లభించింది. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సక్సెస్ రేట్ ను అమాంతం పెంచేసుకున్న ఈయన అప్పట్లో పలు సంచలనాలకు చిరునామాగా నిలిచారు. ఈ క్రమంలోనే తన పేరుకు ముందు ఎన్నో టైటిల్స్ కూడా తోడయ్యాయని చెప్పాలి. అయితే ఎక్కువ కాలంగా వినిపిస్తున్న బిరుదు మాత్రం మెగాస్టార్ అని చెప్పాలి.

గత 35 సంవత్సరాలుగా ఈ టైటిల్ చిరంజీవికి పర్యాయపదంగా మారిపోయింది. వాస్తవానికి ఖైదీ సినిమా ముందు వరకు ఆయన పేరు ముందు ఎలాంటి బిరుదు లేదు.. ఖైదీ సినిమా వచ్చిన తర్వాతనే సినిమాల టైటిల్స్ లో నటకిశోర, యంగ్ డైనమిక్ అండ్ డేరింగ్ హీరో, డైనమిక్ హీరో, డేరింగ్ డాషింగ్ హీరో, సుప్రీం హీరో , సుప్రీం స్టార్ వంటి టైటిల్స్ జోడించారు. అయితే మెగాస్టార్ అనే టైటిల్ ట్యాగ్ కూడా ఆ తర్వాత కాలంలో వచ్చింది. అయితే మెగాస్టార్ కి ఈ ట్యాగ్ రావడం వెనుక కారణం 1988లో వచ్చిన మరణం మృదంగం సినిమా.. ఈ సినిమా అప్పట్లో ఎంతో స్పెషల్ గా నిలిచింది. ఆగస్టు 4 కి సరిగ్గా ఈ సినిమా విడుదలై 35 ఏళ్లు.

ఈ సినిమా ద్వారానే ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు లభించింది.. యండమూరి రచించిన మరణ మృదంగం నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా హిట్ సినిమాల లిస్టులో చేరిపోయింది. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యం అందించగా.. ఇందులోని పాటలన్నీ కూడా విశేష ఆదరణ పొందాయి. అంతేకాదు “గొడవే గొడవ” అనే పాటకి చిరంజీవి స్వయంగా కొరియోగ్రఫీ అందించడం ఇక్కడ అరుదైన రికార్డు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version