సినీ ప్రపంచాన్ని ఏలే క్రమంలో కొన్ని కొన్ని మార్పులు తప్పనిసరి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఇచ్చే బిరుదులని బట్టి పేరు మార్చుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇక పేరు మార్చుకున్న తర్వాత వెనక్కి తిరక్కుండానే సక్సెస్ ని చూస్తూ దూసుకెళ్లిన ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారని చెప్పవచ్చు. అయితే సిల్వర్ స్క్రీన్ ను ఏలిన కొంతమంది నటీమణుల వాస్తవ పేర్లు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
మద్రాస్ లో జన్మించిన జయసుధ సహజనటిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక టాలీవుడ్లోకి అడుగుపెట్టకు ముందు ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుజాత. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి పేరు మార్చుకుంది. ఇక ఆ తర్వాత రాజమండ్రిలో పుట్టిన జయప్రద అసలు పేరు లలితా రాణి . జయప్రద గా మార్చుకొని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి మొదట కోలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను మొదలు పెట్టింది. ఇక తర్వాత బాలీవుడ్ లో, టాలీవుడ్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్.. ఈమె పక్కా తమిలియన్.. బోనీ కపూర్ను పెళ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ కి పరిమితమైంది.
జీవిత రాజశేఖర్.. తలంబ్రాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె స్వస్థలం శ్రీశైలం. ఈమె అసలు పేరు పద్మ. తెలుగింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల చేత ఆరాధించబడ్డ నటి సౌందర్య అసలు పేరు సౌమ్య. ఇక ఆమని అసలు పేరు మంజులా,రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. రంభ అసలు పేరు విజయలక్ష్మి, రాశి అసలు పేరు విజయలక్ష్మి. భూమిక అసలు పేరు రచనా చావ్లా. ఇంకా నేటి జనరేషన్ హీరోయిన్లలో కూడా చాలామంది రకరకాల కారణాలు చేత తమ పేర్లను మార్చుకున్నారు.