పెళ్లి కాన్సిల్ చేయించుకున్న టాలీవుడ్ బ్యూటీ !

-

ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలెంట్ ఉన్న స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయిన పూర్ణ ..నటిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది.తెలుగు చిత్ర పరిశ్రమకు “సీమటపాకాయ్” సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి పూర్ణ అనంతరం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన “అవును” సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం హీరోయిన్ గా అవకాశాలను కోల్పోవడంతో బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్నారు. వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెరపై “డి” “జబర్దస్త్” శ్రీదేవి డ్రామా కంపెనీ ” తదితర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది పూర్ణ. అయితే ఇటీవల ఆమె నిశ్చితార్థం చేసుకొని ఓ ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. జూన్ 1వ తేదీన కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.

కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త శానిద్ ఆసిఫ్ అలీని పెళ్లాడ బోతున్నట్లుగా ఈ మధ్యనే తెలిపింది.అయితే తాజాగా పూర్ణా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణం పూర్ణ ఓ డైరెక్టర్ తో ఎఫైర్ ఉందని తెలియడం అని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ చాలామంది ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజం ఉందా, లేదా? అనేదానిపై పూర్ణ స్పందిస్తుందా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version