కస్టడీతో పాటు తమిళ దర్శకుల్ని నమ్ముకొని బోల్తా కొట్టిన మన చిత్రాలు..

-

చిత్రసీమలో ఎలాంటి కాంబినేషన్​లో సినిమా కుదరుతుందో చెప్పలేము. ఒకప్పుడైతే ఓ భాషలోని స్టార్ హీరోలు, అక్కడి టాప్ డైరెక్టర్స్​తో కలిసి ఎక్కువగా సినిమాలు చేసేవాళ్లు. కొంతమంది మాత్రమే ఎక్స్​పెరిమెంట్లు చేసేవారు. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌ ఎక్కువ అవ్వడం వల్ల భిన్నమైన కలయికల్లో సినిమాలు రూపొందుతున్నాయి. మన డైరెక్టర్స్​ పొరుగు భాషల్లోని కథనాయకులతో, అక్కడి డైరెక్టర్స్​ మన హీరోలతో జట్టు కడుతున్నారు. అలా వాళ్లతో వీళ్లు.. వీళ్లతో వాళ్లు కలుస్తూ సరికొత్త కలయికలకు తెర తీస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఎక్కువగా తమిళ దర్శకులు, మన హీరోలతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నో అంచనాలతో విడుదలైన ఆ కాంబోలు నిరాశపరుస్తున్నాయి. అక్కడ డైరెక్టర్లు మన తెలుగు స్టార్లకు వరుస షాకులు ఇస్తున్నారు.

తాజాగా అక్కినేని నాగచైతన్య.. కోలీవుడ్ డైరెక్టర్​ వెంకట్​ ప్రభుతో కలిసి చేసిన కస్టడీ మే 12న థియేర్లలో రిలీజై మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది.

గతేడాది హీరో రామ్ పోతినేని.. తమిళ దర్శకుడు లింగుస్వామితో చేసిన ‘ది వారియర్’ డిజాస్టర్​గా నిలిచింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్​ గా నటించింది..

హీరో సందీప్ కిషన్​.. కోలీవుడ్ డైరెక్టర్​ రంజిత్​ కాంబోలో వచ్చిన ‘మైఖేల్’​ కూడా అంతే. గౌతమ్​ మేనన్​, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్​కుమార్ వంటి స్టార్లు నటించినా సినిమాకు ఫలితం లేదు.

హీరో శర్వాంద్​, శ్రీ కార్తిక్​ కలిసి చేసిన ఒకే ఒక జీవితం మూవీ కూడా ఆశించిన స్థాయిలో టాక్​ తెచ్చుకోలేదు. టైమ్​ ట్రావెల్​ నేపథ్యంలో వచ్చిందీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

కొన్నేళ్ల కిందట టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్​ బాబు.. తమిళ డైరెక్టర్​ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్పైడర్’ చేశారు. అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచి మహేష్ అభిమానులకు నిరాశ మిగిల్చింది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్​ దేవరకొండ.. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్‌తో ‘నోటా’ చేయగా అది కూడా ఫ్లాప్​గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

గతంలో విక్టరీ వెంకటేశ్ నాగవల్లి, పవన్ కల్యాణ్​ పంజా, కొమరం పులి, బంగారం, రామ్ పోతినేని గణేశ్, ప్రభాస్ రెబల్​ ఎన్నో చిత్రాలు బోల్తా కొట్టాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version