ఇండియన్ సినిమాలో టాప్-10 హీరోయిన్స్ వీళ్లే

-

ఇండియన్ సెల్యులాయిడ్​పై ఇప్పటి వరకూ వందలాది మంది భామలు తళుక్కున మెరిశారు. చినుకులా వచ్చి.. సముద్రంలా మారిన వారున్నారు.. ఉప్పెనలా దూసుకొచ్చి వెలిసిపోయినవారూ ఉన్నారు. మరి, వారిలో ప్రేక్షకుల హార్ట్​ను పర్మనెంట్​గా రెంట్​కు తీసుకున్నవారెవరు? మెజారిటీ ఆడియన్స్​ను మెస్మరైజ్​ చేసిన బ్యూటీస్ ఎవ్వరు..? అని ప్రముఖ వెబ్​సైట్​ సర్వే చేసింది. వారిలో టాప్-10 అందగత్తెలు ఇక్కడున్నారు.

శ్రీదేవి. పట్టాభిషేకం చేయాల్సింది.. ఆమె అందానికా? అభినయానికా? అంటే.. ఎవ్వరూ తేల్చుకోలేని నటి శ్రీదేవి. “నిజంగా అతిలోక సుందరే” అని యునానిమస్​గా ఆడియెన్స్ అంగీకరించిన ఈ ఎవర్ గ్రీన్​ స్టారే.. ఇప్పటికీ నెంబర్ 1.

మాధురీ దీక్షిత్. తన మెస్మరైజింగ్ బ్యూటీతో ఈతరాన్ని సైతం ఫిదా చేస్తున్న గ్లామరస్ హీరోయిన్ మాధురి. ఏక్, దో, తీన్ అంటూ.. తను వేసిన స్టెప్పులు.. ఇప్పటికీ అల్లాడిస్తూనే ఉంటాయి. అలాంటి అందాల డ్యాన్సర్.. సెకండ్ ప్లేస్​ కొట్టేసింది.

సావిత్రి. మన తెలుగు మహానటి కీర్తి.. ఏ స్థాయిలో దేశవ్యాప్తమైందో చెప్పడానికి.. ఈ సర్వేలో ఆమెకు దక్కిన స్థానమే నిదర్శనం. కేవలం కళ్లతో భావాలను పలికించిన అద్వితీయ నటి.. దేశంలో మూడోస్థానంలో నిలిచారు.

మధుబాల. బాలీవుడ్ చరిత్రలో ఎంతో మంది అందంతో కనువిందు చేసినా.. చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ కొందరిదే. అలాంటి వారిలో ఒకరు మధుబాల. అందుకే ఆమెను.. ‘వీనస్ ఆఫ్ స్క్రీన్’ అని పిలుస్తారు.

శారద. ఊర్వశిగా తెలుగు చిత్రసీమలో.. ఆమె పోషించిన పాత్రలు అమోఘం. తనదైన నటనతో.. ఏకంగా మూడుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న శారద.. ఐదో స్థానంలో నిలిచారు.

షబానా అజ్మీ. ఈ అసాధారణ టాలెంటెండ్ ఆర్టిస్టు పేరు.. ఇప్పటికీ చిత్రపురిలో వినిపిస్తూనే ఉంటుంది. తనదైన అభినయంతో వెండితెరపై చెరిగిపోని సంతకం చేశారు.

నర్గీస్. అలనాటి అందాల తారగా.. నర్గీస్ వెండితెరపై అద్భుతాలే చేశారు. ఆమె నటనకు సినీ ప్రపంచం పులకించిపోయింది. పద్మశ్రీ అవార్డు గెలుచుకున్న తొలి సినీ నటిగా చరిత్ర సృష్టించారు.

స్మితా పాటిల్. బాలీవుడ్​ ఇండస్ట్రీలో పదేళ్ల కెరియర్ చిన్నదే. దశాబ్ద కాలం మాత్రమే తెరపై కనిపించిన స్మితా.. వెండితెరపై శాశ్వత ముద్ర వేశారు.

మాధబి ముఖర్జీ. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన “చారులత” చిత్రంలో టైటిల్ రోల్ ప్లేచేసింది. అలా తిరుగులేని నటిగా గుర్తింపు పొంది.. ఆడియన్స్​ను మెప్పించారు.

 

రేఖ. అందం, అభినయంతో.. బాలీవుడ్ వెండితెరను ఓ ఊపు ఊపేసిన తార ఈమె. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఈ సర్వేలో టాప్​-10లో స్థానం సంపాదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version