Ugram : ఉగ్రం ట్రైలర్ కు ముహుర్తం ఫిక్స్‌

-

అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రొటీన్ కామెడీ చిత్రాలను పక్కనపెట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో పలకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అంటూ డిఫరెంట్ మూవీ తో పలకరించిన అల్లరి నరేష్ అంతకు ముందు “నాంది” అంటూ మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.

ఈ కోవలో నాందితో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు విజయ్ కనకమెడల దర్శకత్వంలో తాజాగా “ఉగ్రం” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ పథకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో మిర్నా తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైల ర్‌ అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్‌ ను రేపు సాయంత్రం రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రక టించింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version