ఈ వారం విజేత ఎవరు..వీర? వీరయ్య..?

-

తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు చాలాకాలం తర్వాత ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉంది అని చెప్పవచ్చు. అందుకు కారణం వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలే అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి.. ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అభిమానులు అటు వాల్తేరు వీరయ్య ఇటు వీర సింహారెడ్డి సినిమాలు చూసి అసలైన పండుగ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే తొలి మూడు నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ సులభంగా క్రాస్ చేసిన ఈ రెండు సినిమాలు కూడా వారం తర్వాత బాక్సాఫీస్ దగ్గర మరింత జోరుతో కొనసాగుతూనే ఉన్నాయి.

ఇకపోతే తొలి వారం ఏ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనే విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ఫుల్ వింటేజ్ లుక్.. మాస్ అవతార్లో కనిపించిన సినిమా వాల్తేరు వీరయ్య.. బ్రదర్ సెంటిమెంటుతో తీసిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల గ్రాఫ్ వసూల్ చేసిందని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. మరొకవైపు బాలయ్య ని ఫుల్ యాక్షన్ అవతార్లో ఆవిష్కరించిన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా కూడా తొలి నాలుగు రోజుల్లో రూ.104 కోట్లు సాధించిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

తాజాగా ఫస్ట్ వీక్ కలెక్షన్ కి సంబంధించిన రిపోర్టు వచ్చేసింది. మరి ఏ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అంటే.. మొదటివారం ముగిసేసరికి వాల్తేరు వీరయ్య సినిమా రూ.165.45 కోట్ల గ్రాస్ , రూ.96.46 కోట్ల షేర్ వసూలు చేసిందని సమాచారం. వీర సింహారెడ్డి విషయానికి వస్తే రూ.68.51 కోట్లలో షేర్ తో పాటు రూ.114.95 కోట్ల గ్రస్స్ వసూలు చేసినట్లు సమాచారం ఇకపోతే వారం ముగిసేసరికి వీర పై వీరయ్య పై చేయి సాధించినట్లు తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version