ఈ ఆదివారం మరింత వినోదం పంచేందుకు మీ ముందుకు వస్తోంది జీ తెలుగు

-

హైదరాబాద్, 14 ఫిబ్రవరి 2023: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ ఆదివారం మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రత్యేక ఎపిసోడ్స్తో వచ్చేస్తోంది. మోస్ట్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న నాన్ ఫిక్షన్ షోలు లేడిస్ & జెంటిల్మెన్, సరిగమప ఛాంపియన్షిప్ కార్యక్రమాల్లో మరింత వినోదాన్ని జోడించి అందిస్తోంది. నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాని తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయనుంది. 19 ఫిబ్రవరి, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వరుస షోలతో నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వచ్చేస్తోంది మీ అభిమాన ఛానల్ జీ తెలుగు..

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే లేడీస్ & జెంటిల్మెన్ షోలో బుల్లితెరపై అభిమానులను అలరిస్తున్న గోకుల్‌ దీప్తి, అంజన రాజీవ్ మరియు మున్నా– _ హర్ష్లా పాల్గొని యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి మరింత వినోదాన్ని పంచారు. మూడు రౌండ్లలో మూడు జంటలూ పోటాపోటీగా పాల్గొని వరుస పంచులతో నవ్వులు పూయించారు. సాయంత్రం 6 గంటలకు నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది కేవలం మీ జీ తెలుగులో!

రొటీన్కి భిన్నంగా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్తో నితిన్ నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఐఏఎస్ ఆఫీసర్గా నితిన్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఈలలు వేయించాయి. రాజకీయ నాయకుడిపై ఐఏఎస్ అధికారి చేసే పోరాటం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాలో కేథరిన్, వెన్నెల కిషోర్, సముద్ర ఖని ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఆసక్తికర మలుపులతో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సాయంకాలాన్ని మరింత సరదాగా మార్చడం ఖాయం!
తెలుగు ప్రజలను ఆకట్టుకుంటూ పదిహేను సీజన్లతో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న షో సరిగమప ఛాంపియన్షిప్. ఈ ఆదివారం 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్కి ముఖ్య అతిథిగా గత సీజన్ జడ్జి సింగర్ స్మిత షోలో పాల్గొననున్నారు..

ఎప్పటిలాగానే ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పంచులు, న్యాయనిర్ణేతలు ఎస్. పీ. శైలజ, మనో, అనంత శ్రీరామ్ చణుకులతో షో ఆద్యంతం నవ్వులతో సరదాగా సాగుతుంది. మెంటర్ల శిక్షణలో అద్భుతంగా రాణిస్తున్న గాయనీగాయకులు తమ గాత్రంతో మరో చక్కని ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తారు. ప్రేక్షకులను అలరించే చక్కని ప్రదర్శనలతోపాటు భావోద్వేగాల సమాహారంగా ఈ వారం మీ ముందుకు రానుంది సరిగమప ఛాంపియన్షిప్. మీ అభిమాన ఛానల్ జీ తెలుగుతో ఈ ఆదివారం మరింత వినోదంగా మార్చుకునేందుకు మీరూ సిద్ధంకండి!

ఈ ఆదివారం వరుస షోలు, మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది మీ జీ తెలుగు.. తప్పక చూడండి!

Read more RELATED
Recommended to you

Latest news