ఆ అమ్మవారిని భక్తితో కొలిస్తే కోరిన కోర్కెలు ఇట్టే నెరవేరుతాయి..!!

-

మనసు పెట్టి పిలిస్తే ఏ దేవుడు అయిన పలుకుతాడు అనే నానుడి అందరికి తెలిసిందే..అలా మనం భక్తితో మొక్కితే కోరిన కోరికలు తీర్చె అమ్మవారు కూడా ఉన్నారు. అక్కడ కోరుకున్న కోరికలు తీరుతుండటంతో ప్రతి ఏటా భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది.ఆ ఆలయ విషేషాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు…కంచిలో అమ్మవారు.. సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితాసహస్రనామ జపం జరపడమే అనువైన మార్గం.

దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. దేవి సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు చరిత్ర చెబుతుంది..

ఈ ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు..శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చొనట్లు మలిచారు.దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం..

గాయత్రీ మంటపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగా వేదాలుగా, 24స్తంభాలను గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు.

అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతీ బుధవారం చందనకాపు పూజ,ప్రతి రోజు మూడు సార్లు అభిషేకం చేస్తారు..పిల్లలు లేని వారు అమ్మకు ముడుపులు చెల్లిస్తారు..సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. మీరు ఎప్పుడైనా అటు వెళితే అమ్మవారిని తప్పక దర్శనం చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news