రాత్రుళ్లు నిద్రలో హఠాత్తుగా లేస్తున్నారా..? ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయేమో..

-

ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉంటే.. వాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉన్నా సంతోషంగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో ఒక చికాకు వెంటాడుతూనే ఉంటుంది. ప్రశాంతత ఉండదు. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. మనం వాటిని గమనిస్తే.. పరిష్కార మార్గాలు ఆలోచించవచ్చు. ఈరోజు మనం ఆ సంకేతాలు ఏంటో, వాటి పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం.!

ఎవరి ఇంట్లో అయినా దుష్ట శక్తుల ప్రభావం ఉంటే పీడ కలలు రావడం లేదంటే రాత్రి నిద్రలో హఠాత్తుగా మెలుకువ రావడం జరుగుతుంది. అంతే కాదు ఎప్పుడు భయం వేయడం లాంటివి కనుక జరిగితే దుష్ట శక్తి ఉందని మనం అర్థం. అలానే ఎక్కువగా రాత్రిపూట చిన్న పిల్లలు ఏడుస్తున్నా సరే అదృశ్యశక్తులు అక్కడ ఉన్నాయని మనం గ్రహించుకోవాలని పండితులు అంటున్నారు..

దుష్ట శక్తులను ఎలా తొలగించాలి..?

ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేస్తే అప్పుడు ఇంట్లో ఉండే దుష్టశక్తుల్ని బయటకి పంపించేయొచ్చు.
ఎప్పుడూ కూడా ఇంట్లో దూపం వేస్తూ ఉండాలి. ధూపం వేయడం వల్ల దుష్ట శక్తులు బయటకు వెళ్లిపోతాయి.
కొన్ని తులసి ఆకులు తీసుకుని వాటి నుంచి రసం తీసి అందులో కొన్ని నీళ్లు కలిపి కలశంలోని ఆ నీళ్లు వేసి ఆ నీళ్ళతో పూజ చేయాలి. అలానే ఇల్లంతా కూడా ఆ నీటిని జల్లాలి. ఇలా చేయడం వల్ల దృష్టశక్తులు పోతాయి.
ఇంటి ముఖద్వారం మీద స్వస్తిక్ వంటి గుర్తులు రాస్తే కూడా దుష్టశక్తి రాదు. కాబట్టి ఇంటి ముఖద్వారం దగ్గర ఈ విధంగా పాటించండి.
దుష్టశక్తుల బారిన పడకుండా ఉండాలంటే వెండితో తయారుచేసిన ఆభరణాలను వేసుకుంటే మంచిది. దీనితో పీడకలలు కూడా రావు.
జీలకర్ర, ఉప్పుని తీసుకుని వాటిని కలిపి ఇల్లంతా జల్లితే దుష్టశక్తి బాధల నుంచి బయటపడచ్చు.

ఇవన్నీ నిజంగా జరుగుతాయా అంటే.. ప్రతీదాని వెనుక ఒక సైంటిఫిక్‌ రీజన్‌ ఉంటుంది. కొన్ని నెగిటివ్‌ ఎనర్జీలకు కొన్ని పనులు పరిష్కారం చూపుతాయి. వాస్తు కూడా సైన్స్‌లో భాగమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version