దేవుడు ముందు ఏడిస్తే.. ఏం అవుతుంది..?

-

దేవుడి దగ్గర కూర్చుని చాలా మంది ఏడుస్తూ ఉంటారు. దేవుడి దగ్గర కూర్చుని ఏడిస్తే ఏమవుతుంది..? సాధారణంగా మనకి ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుణ్ణి ప్రార్థించి, ఆ కష్టం నుండి బయట పడేయమని కోరుకుంటాము. వాళ్ల కష్టాలని వాళ్ళ బాధల్ని భగవంతుడికి చెప్పుకుని బాధ పడుతూ ఉంటారు. ఆ క్రమంలో కొంత మంది తెలియక ఏం చేస్తూ ఉంటారు..? అయితే బరువుగా ఉన్న మనసు భగవంతుడికి మనం చెప్పుకోవడం వలన తేలికగా మారుతుంది.

 

మనసులో బాధ అంతా కూడా పోతుంది. అనుకున్నది అవుతుందా లేదా కష్టం తీరుతుందా లేదా అనే మాట పక్కన పెట్టేస్తే మనసు కుదురుగా ఉంటుంది. లోలోపల సంతోషం కలుగుతుంది. బాధ పోయినట్లు బరువు తొలగిపోయినట్లు మనకి కలుగుతుంది. భగవంతుడితో కాకుండా మన యొక్క బాధని మనం ఇతరులకి చెప్పినట్లయితే ఇతరులు వాళ్ళని చూసి హేళన చేస్తారు తప్ప బాధ నుండి మనం బయటకి వచ్చేలేము.

పైగా జాలిగా వాళ్ళు మనల్ని చూస్తారు. అదే భావన వాళ్ళల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. కాబట్టి చాలా మంది భగవంతుడు దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క బాధలను చెప్పి ఏడుస్తారు. ఒకవేళ కనుక కోరిక తీరిపోయింది అంటే భగవంతుడు తీర్చారని భావిస్తారు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్లి మన యొక్క బాధని చెప్పుకుని ఏడవడం కూడా ఒకందుకు మంచిదే. కాస్త తేలిక పడుతుంది మనసు. అలానే భారం తగ్గుతుంది. బాధ పోతుంది హాయిగా ఉండొచ్చు పాజిటివ్ గా ఉంటాము మంచి ఎనర్జీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version