వెయ్యి ఏళ్ల నాటి కుంగుంది దుర్గం.. గిరిప్రదక్షణ చేస్తే పాపాలు అన్ని పోతాయట..!

-

అదో గ్రామం.. మధ్యలో కోట. దాని మీద శైవక్షేత్రం. ఆ కోట చుట్టూ.. గ్రామ దేవతలు కొలువై ఉంటారు. ఇది ఎక్కడో కాదు.. మన చిత్తూరు జిల్లా.. కుప్పంలోనే కంగుంది. ఇక్కడ మల్లేశ్వర స్వామిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే.. పాపాలు అన్నీ పోతాయట. ఆలయం గురించి ఎన్నో కథలు నానుడిలో ఉన్నాయి. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోట గురించి మనం ఈరోజు ఓ లుక్కేద్దాం..
ఈ ఆలయం గురించి ప్రజలు చెప్పే కథలు ఇలా ఉన్నాయి.. ఒక గద్ద, పావురం ఈ దుర్గం చుట్టూ తిరిగి ముక్తి పొందాయట. మరో కథనాన్ని అనుసరించి పూర్వం కలినందపురంలో శివభక్తులైన కరుణ, కాంతారాజు దంపతులుండేవారు. వీరికి సంతానం లేదట. ఒకరోజు కాంతారాజుకు శివుణ్ణి తలపై మోస్తూ ఊరంతా తిరిగినట్లు కల వచ్చింది. మర్నాడు కల గురించి ఒక సాధువుకు చెప్తే.. తపస్సు చేయమన్నారు. తమ సంపదలన్నీ ప్రజలకు దానం చేసి, అడవికి వెళ్లి తపస్సు చేశాడట. కొన్నేళ్లకు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. తాము స్వామిని ఎల్లవేళలా మోసే భాగ్యం కలిగించమని కోరారు. శివుడు తల పంకించి, ‘తథాస్తు! మీరు కలియుగంలో కొండగా ఆవిర్భవిస్తారు, ఆ గిరిపై నేను కొలువుంటాను’ అని చెప్పి అంతర్థానమయ్యాడు.
అలా వెలసిందే ఈ కొండ. క్రీ.శ. 1066లో కంబినాయుడు అనే రాజు తన హయాంలో మల్లేశ్వరుడికి మహాశివరాత్రి నాడు ఘనంగా పూజలు చేయించాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ కొండపై జాతర నిర్వహిస్తున్నారు. భక్తులతో పాటు చారిత్రక ఆసక్తి ఉన్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ దుర్గాన్ని దర్శించుకోవడం విశేషం.. చిత్తూరు నుంచి కుప్పంకు బస్సు, రైలు మార్గాలున్నాయి. కుప్పం నుంచి బస్సులో ఇక్కడికి చేరుకోవచ్చు.
ఈ కొండ గురించి కుప్పం ప్రజలకు కచ్చితంగా తెలిసి ఉంటుంది. అన్ని ఏళ్లనాటిది కాబట్టి అక్కడ ఈ కొండకు ప్రత్యేక స్థానం ఉంది. మీరెప్పుడైనా ఈ ఏరియాకు వెళ్తే.. ఇలాంటి పురాతన కొండలను చూడ్డం మర్చిపోకండే.. ఒక్కో ప్రదేశానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఆంధ్రాలో ఇలాంటి పురాతనమైనవి ఎక్కుగా చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలనో ఉంటాయి. పలాసలో కూడా 500 ఏళ్లనాటి పెద్ద శివలింగం ఉంది. ఈ ప్లేస్ చూడ్డానికి బాగుంటుంది కానీ.. ప్రాచుర్యం లేకపోవడంతో పెద్దగా ఎవరికీ తెలియదు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news