అక్వేరియంలో చేపలు చనిపోతున్నాయా..? ఈ తప్పులు చేస్తున్నారేమో..!!

-

ఇంట్లో చేపలను పెంచడం అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టం ఉంటుంది. ఇంకా ఇది పాజిటివ్‌ ఎనర్జీని డవలప్‌ చేస్తుంది. వాస్తు ప్రకారం చూసుకుని అక్వేరియం పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కూడా. అయితే అక్వేరియంలో చేప పిల్లలు చనిపోతే అంతే భాదేస్తుంది. ఏదో ఆందోళనగా అనిపిస్తుంది కూడా..మనం చేసే కొన్ని తప్పుల వల్లే చేప పిల్లలు చనిపోతాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా..!

అక్వేరియంలో వేసిన వెంటనే చేపలు చనిపోతాయి. అవి అలా చనిపోవడం వెనుక కారణం మనకు అర్థం కాదు. చేపలకు తొందరగా ఇన్ఫెక్షన్ సోకడమే దీనికి కారణం. చిన్న విషయాల ద్వారా కూడా వ్యాధి బారిన పడి ఇలా చనిపోతాయి. మీరు ఫిష్ అక్వేరియం సరిగ్గా నిర్వహించకున్నా ఇలా చేపలు చనిపోతాయి. మీ అక్వేరియం శుభ్రంగా లేనప్పటికీ, చేపలు చనిపోవచ్చు.

చేపలను కూడా చిన్న డబ్బాలు లేదా కుండలలో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కొందరు చేపలను సీసాలలో పెట్టి విక్రయిస్తున్నారు. అయితే, గ్లాస్ అక్వేరియం కంటే చేపలకు మెరుగైనది ఇంకా ఏదీ లేదు. అక్వేరియం నుంచి చేపలను పెంచడం ,తరలించడం సులభం. మీరు అక్వేరియం ఖరీదైనదిగా భావిస్తే, మీరు గాజు దుకాణం నుండి చిన్న గాజు పలకలతో తయారు చేసిన కుండను ఉపయోగించవచ్చు. రాతి కృత్రిమ కాంతి ,ప్లాస్టిక్ మొక్కలతో అలంకరించుకోవచ్చు.

మార్కెట్‌ నుంచి చేపలు తెచ్చేటపుడు సంచిలో తెస్తాం… ఆ సమయంలో బ్యాగ్‌లోని నీటి ఉష్ణోగ్రత అక్వేరియంలోని నీటి ఉష్ణోగ్రతకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి వెంటనే బ్యాగ్‌లోని నీటి నుండి చేపలను తీసివేసి అక్వేరియంలో వేయవద్దు. బ్యాగ్‌ను అక్వేరియంలో 30 నిమిషాలు ఉంచండి, తద్వారా ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. ఆ తర్వాత మెల్లిగా బ్యాగ్‌ను బయటకు తీయండి. అది ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రతి మూడు రోజులకు 1/3 అక్వేరియం నీటిని మార్చండి. సమాన మొత్తంలో తాజా పంపు నీటితో నింపండి. ప్రతి మూడవ వారానికి మళ్లీ 3/4 నీటిని మార్చండి. గోరువెచ్చని, తాజా పంపు నీటితో నింపాలి.. ఈ ప్రక్రియ ఆక్సిజన్‌ను వ్యాప్తి చేస్తుంది.

నీటిని మార్చేటప్పుడు అక్వేరియం గోడలను స్పాంజితో శుభ్రం చేయండి. గోడలను నీటిని కేవలం స్పాంజి లేదా కాటన్ క్లాత్‌తో మాత్రమే శుభ్రం చేయండి, డిటర్జెంట్‌ను ఉపయోగించవద్దు. ఆ వాసనకు చేపలు చనిపోవచ్చు..

చేపలు చనిపోవడానికి ఒక కారణం వాటికి ఎక్కువ ఆహారం ఇవ్వడం. కాబట్టి ఎల్లప్పుడూ ఒక షెడ్యూల్‌ను సెట్ చేయండి. దాని ప్రకారం మాత్రమే చేపలకు ఆహారం ఇవ్వాలి.. మీకు టైం ఉంది కదా అని అదే పనిగా ఆహారం వేస్తే అవి చనిపోతాయి..

Read more RELATED
Recommended to you

Latest news