వాస్తు: డబ్బులు చేతిలో నిలవాలంటే ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి..

-

ఈరోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం..అయితే కొంత మందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చిన చేతిలో నిలవదు..ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదొక రూపంలో డబ్బు అయిపొతాయి..అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగతీస్తుంటాయి. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిలవదు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వారు పేదవారిగా మారుతారు.

అయితే అటువంటి వారు కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవడం మంచిది. వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు వారిని జీవితంలో వెనక్కి లాగుతూ ఉంటాయి. అయితే ఇంట్లో ప్రధానంగా మూడు మూలల ప్రభావం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి పైకప్పు మీద ఉండే వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో ఉంచితే చాలా నష్టం జరుగుతుంది. ఈ దిశలో వాటర్ ట్యాంక్ పెడితే ఆ ఇల్లు పేదరికం అనుభవించక తప్పదు. వాస్తవానికి ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం. అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. దీని వలన వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఇంట్లో తరచూ గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. అందుకనే వాటర్ ట్యాంకును నైరుతి దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది.

నైరుతి దిశ సానుకూల ప్రతికూల శక్తులను సమతుల్యం చేస్తుంది. అలాగే వాటర్ ట్యాంకును దక్షిణ దిశలో ఉంచిన మంచిదే. దక్షిణ దిశలో వాటర్ ట్యాంకులు నిర్మిస్తే ట్యాంక్ స్లాబ్ కు మధ్య కనీసం ఒకటి రెండు అడుగుల ఖాళీ స్థలం ఉండేలా నిర్మించాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.. బాత్ రూమ్ లు ఈశాన్య దిశలో వుంచితే మంచిది. ఈశాన్య దిశలో మరుగుదొడ్లు ఉంటే ఎంత కష్టపడినా ఫలితం మాత్రం బూడిదలో పోసిన పన్నీరు గానే మారుతుంది.

వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు దుమ్ము ధూళి లేకుండా చెత్తచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ దిశలో కుబేరుడు ఉంటాడు. కుబేరుడు ఉండే స్థానంలో ఎప్పుడు చెత్తాచెదారం వేయకూడదు. అలా వేస్తే పేదరికానికి గురవుతారు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి బారిన పడతారు. ఉత్తర దిశ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. కాబట్టి ఉత్తర దిక్కులో ఎటువంటి చెత్తాచెదారం వేయకూడదు. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది…అందుకే ఈ మూడు విషయాలు తప్పక తెలుసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news