వాస్తు: భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తొలగి ప్రేమ పెరగాలంటే ఇలా చెయ్యండి..!

-

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత జీవితం మరోలా ఉంటుంది. అయితే కొందరు భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉంటే.. మరికొందరు భార్యభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే భార్య భర్తల మధ్య సమస్యలు లేకుండా ప్రేమగా ఉండాలంటే పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మీ భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి.

అదే విధంగా ప్రేమ కూడా పెరుగుతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాల గురించి చూసేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా భార్యాభర్తలు అనుసరిస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. భార్య భర్తలు ఉండే బెడ్ రూమ్ లో ఈ విధంగా మార్పులు చేస్తే మంచిది.

భార్యా భర్తలు ఉండే బెడ్ రూమ్ లో ఎరుపు రంగు చాలా మేలు చేస్తుంది. అందుకనే ఎరుపు రంగుతో ఉన్న ఫోటోలను కానీ పిక్చర్స్ ని కానీ వేలాడదీస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగి పోతాయి. అదే విధంగా బంధం బలపడుతుంది. నిజంగా రంగులు ఎంతో మంచిని తీసుకు వస్తాయి. కాబట్టి పండితుడు చెప్పినట్లు ఇలా అనుసరిస్తే గొడవలు తగ్గుతాయి.

ఎరుపు లేదా పింక్ కలర్ పిక్చర్స్ ని మీరు పెట్టొచ్చు. ప్రేమ పెరిగి, నమ్మకం కూడా పెరుగుతుంది అలానే గొడవలు తగ్గుతాయి. స్టడీ రూమ్ లో అయితే లైట్ గ్రే కానీ నీలం రంగు ఫోటోలను కానీ వేలాడదీయడం మంచిది. ఇలా చేయడం వల్ల పిల్లలు బాగా చదువుకోవడానికి అవుతుంది. పిల్లల బెడ్ రూమ్ లో ఆరెంజ్ లేదా పర్పల్ కలర్ ని పెడితే మంచిది. ఇలాంటి మార్పులు చేసి ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version