మనీ ప్లాంట్ ను ఈ ప్లేసులో నాటితే.. ధనలక్ష్మి మీ వెంటే

-

ఇండోర్ ప్లాంట్స్ పై ఇప్పుడు ప్రజలకు ఆకర్షణ పెరిగింది..హాల్ ను గ్రీనరీగా మార్చేపనిలో ఉన్నారు చాలామంది గృహిణులు. ఇంట్లో పెంచుకునే మొక్కల్లో చాలా రకాలు చెట్లు ఉన్నాయి. అయితే అందరి ఇళ్లలో కామన్ గా ఉండే మొక్క మనీప్లాంట్..దీని అందం కోసం కంటే..పైసల్ వస్తాయ్ అనే చాలామంది తెచ్చి పెంచుతున్నారు. ఇది శాస్త్రం ప్రకారం నిజమే. ఈ మొక్క ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇంట్లో మనీ ప్లాంట్ నాటేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. జీవావరణ శాస్త్రం ప్రకారం ఈ నియమాలను పాటిస్తూ మనీ ప్లాంట్ నాటితే ధనలక్ష్మి మీ వెంటే ఉంటుందట. అలాగే రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

వాస్తు ప్రకారం ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంటే మంచిది. ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇంట్లో ఆనందం, మానసిక శాంతిని కలిగి ఉండాలంటే.. ఈ మనీ ప్లాంట్‏ను తాడు లేదా కొమ్మ సహాయంతో పైకి కట్టాలి. ఇలా చేస్తే మీ ప్రతిష్ట పెరుగుతుంది. అ

లాగే ఇంటికి ఉత్తర ద్వారం వద్ద మనీ ప్లాంట్ ఉంచడం వలన కొత్త ఆదాయ వనరులు ప్రారంభమవుతాయట. దీంతో మీ జీవితంలో అన్ని విజయాలే చోటు చేసుకుంటాయి. మనీ ప్లాంట్లను ఎప్పుడు పొడిగా ఉంచకూడదు… ఈ చెట్టుకు నీరు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

ఇక మనీప్లాంట్ ను ఎప్పుడు ఆరుబయట ఉంచకూడదు. ఎప్పుడూ కూడా ఈ చెట్టు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇతరుల దృష్టి ఎక్కువగా మనీ ప్లాంట్ పై పడకూడదు.. చెడ్డవారి చూపు తగిలి ఈ చెట్టు ఎండిపోతుందట. అందుకే ఇతరులకు కనిపించకుండా ఇంట్లో పెట్టాలి. ఈ చెట్లను గాజు కుండీలలో లేదా పచ్చని కుండీలలో పెడితే సంపద పెరుగుతుంది.

రెడ్ మనీ ప్లాంట్ ను నివారించడం కూడా మంచిది కాదు. దీంతో అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. మనీ ప్లాంట్స్ యాదృచ్చికంగా పెరుగుతాయి. కాబట్టి వీటిని కంటైనర్లలో ఉంచితే లాభాలు పెరుగుతాయి.

మనీ ప్లాంట్ సంపదకు చిహ్నంగా ఉంటుంది. ఈ చెట్టును కొనుగోలు చేసేటప్పుడు ముదురు ఆకుపచ్చ రంగు.. లేదా మంచి పండు రంగులో తీసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోని కొనుగోలు చేయండి.

ఈ కథనాన్ని జీవావరణ శాస్త్రం ప్రకారం మీకు అందించటం జరిగింది. పెంచేవారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇలాంటి వాటిపై నమ్మకం లేని వారు లైట్ తీసుకుని లాగించేయండి..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news