రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ గణాంకాల వాస్తవికతపై తరచూ అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అక్షయపాత్ర మెఘా కిచెన్ వద్ద ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉచితంగా నిత్యవసరాల కిట్ అందిస్తుండటంతో కోవిడ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ సమయంలో చాలామందికి రెండో డోసు సైతం తీసుకున్నారని వెబ్సైట్లో చూపిస్తుండడంతో పలువురు ఆందోళన చెందారు.