ఇల్లందు మండలం పొలారం గ్రామ పరిధిలోని సీట్ల తండా, బాదువు తండా, బొంబాయి తండాల్లో మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అకాల వర్షానికి దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న పంటలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులతో మాట్లాడి పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.